Kooti Kosam

కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని
కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని
తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి
యెంత కష్టం యెంత కష్టం

మూడు రోజులు ఒక్క తీరుగ నడుస్తున్నా దిక్కు తెలియక
నడిసముద్రపు నావ రీతిగా సంచరిస్తూ సంచలిస్తూ
దిగులు బడుతూ దీనుడౌతూ తిరుగుతుంటే
చండ చండం తీవ్ర తీవ్రం
జ్వరం కాస్తే భయం వేస్తే ప్రలాపిస్తే
మబ్బు పట్టి గాలి కొట్టి
వాన వస్తే వరద వస్తే
చిమ్మ చీకటి కమ్ముకొస్తే
దారి తప్పిన బాటసారికి
ఎంత కష్టం ఎంత కష్టం
కళ్ళు వాకిట నిలిపి చూసే పళ్ళెటూళ్ళో తల్లి యేమని పలవరిస్తోందో
కళ్ళు వాకిట నిలిపి చూసే పళ్ళెటూళ్ళో తల్లి యేమని పలవరిస్తోందో

కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని
తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి
ఎంత కష్టం ఎంత కష్టం

Credits
Writer(s): M.s. Viswanathan
Lyrics powered by www.musixmatch.com

Link