Nee Magasiri

నీ మగసిరి మషాలా, నాకే కావాలా
నా పరువం, దరువం నీవల్ల దివాళా అవ్వాలా ఇవాళ
నీ సొగసుల ఉయ్యాలా, నేనే ఊగాలా
నీ బింకం పొంకం నావల్ల దివాళా అవ్వాలా ఇవాళ
నీ మగసిరి మషాలా, నాకే కావాలా

నీ సుతారమంతా సుఖాల శృతిలో సితార వాయించనా
ఈ వయ్యారి సొగసులు కాజేసి ముద్దుల విరాళమే ఇవ్వనా
నీ బిగింపు తెగింపు నా ఒంపుసొంపుకి ముగింపు కావాలిరా
నా గులాబిరేకుల జిలేబి కైపులు గులాములవ్వలిరా
నువ్వడిగితే తీసివ్వనా
నీ ఒంటికే scent అవ్వనా
నీ మగసిరి మషాలా, నాకే కావాలా
నీ సొగసుల ఉయ్యాలా, నేనే ఊగాలా

నీ మిఠాయి మాటల గిటారు పాటలు నిటారితో పాడుకో
నా పరాకి కాళ్ళకు సరైన గురైన జవాబులే చెప్పుకో
నీ హుషారు ఊపుల నిషాలలోపల రసాలు అందించవే
నీ సూదంటి నడుముని నాకంటి చూపుల దారాలలో దాచవే
నువ్వడిగితే నేనివ్వనా
చేయి తగిలితే పూవవ్వనా
నీ సొగసుల ఉయ్యాలా, నేనే ఊగాలా
నీ బింకం పొంకం నావల్ల దివాళా అవ్వాలా ఇవాళ
నీ మగసిరి మషాలా, నాకే కావాలా
నా పరువం, దరువం నీవల్ల దివాళా అవ్వాలా ఇవాళ



Credits
Writer(s): Chakravarthy, Jonnavithala Ramalingeswara Rao
Lyrics powered by www.musixmatch.com

Link