Agni Sikhala

అగ్నిశిఖల సంకేతం ఈ గీతం
భరతజాతి జాగృతికిది సందేశం
ఆవేశం కోల్పోయిన మీకోసం
గర్జించే... అర్జున శంఖారావం
అగ్నిశిఖల సంకేతం ఈ గీతం
భరతజాతి జాగృతికిది సందేశం

అరాచకత్వం ప్రబలిన దేశం
అమాయకులకే బలిపీఠం
సాహసవంతులు చచ్చిన సంఘం
సగటు మనుషులందరికీ ఉరికంబం
పౌరహక్కు పతనానికి పరాకాష్ఠ ఈ ఘట్టం
అల్లూరి, భగత్ సింగ్ పునర్జన్మమీ సాక్ష్యం
ఒక్కసారి పచ్చి నిజం పల్లవి పాడండి
గూండా రక్కసి రాజ్యం కూల్చేయండి
అగ్నిశిఖల సంకేతం ఈ గీతం
భరతజాతి జాగృతికిది సందేశం

అమానుషంగా సహనమూర్తినే
వంచనతో బలిచేసిన ఘాతకులు
కిరాతకంగా దేశమాతపై గుళ్ళవాన కురిపించిన విద్రోహులు
దేశానికి దారుణాల తోరణాలు కడుతుంటే
అనుక్షణం ఈ సంఘం రణరంగం అవుతుంటే
సాహసించి చేయండి శాంతికి నవయజ్ఞం
దురంతాల అంతానికి ఇదే మనకు శుభలగ్నం

అగ్నిశిఖల సంకేతం ఈ గీతం
భరతజాతి జాగృతికిది సందేశం
ఆవేశం కోల్పోయిన మీకోసం
గర్జించే... అర్జున శంఖారావం



Credits
Writer(s): Chakravarthy, Jonnavithala Ramalingeswara Rao
Lyrics powered by www.musixmatch.com

Link