Naanna Nuvvu Naaku

నాన్నా నువు నాకు అమ్మయినావా
మళ్ళీ బ్రతికించి బ్రహ్మయినావా

కడుపులో నను చంపే ఘడియలలోనే
కవచంగా మారి కాపాడావా
కూతురు పుడితే బరువని తలచీ
కత్తులు దూసే లోకములోన
నిను చూసి మారిపోతె తండ్రులు
చనిపోరు కదా ఆడ బిడ్డలు
నాన్నా నువు నాకు అమ్మయినావా
మళ్ళీ బ్రతికించి బ్రహ్మయినావా

అమ్మ పాలను తాగే యోగం కొరకే దేవుడు భువిలో మనిషిలాగా పుడతదట
నాన్న చిటికెనేలు పట్టి నడిచే కోసం దైవం స్వర్గం వీడి వస్తడట
ఆ అదృష్టాన్ని ఇస్తివి నాకు నాన్నా
నా కన్నీళ్ళతో కాళ్ళను కడిగి నీకూ
సేవ చేసే బిడ్డగ నేను జీవితమంతా రుణపడి ఉంటా

నాన్నా నువు నాకు అమ్మయినావా
మళ్ళీ బ్రతికించి బ్రహ్మయినావా
కూతురు పుడితే బరువని తలచీ
కత్తులు దూసే లోకములోన
నిను చూసి మారిపోతె తండ్రులు
చనిపోరు కదా ఆడ బిడ్డలు



Credits
Writer(s): Suddala Ashok Teja, Sabu Varghese
Lyrics powered by www.musixmatch.com

Link