Emo Emo Ye Gundello

ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో
ఓ కొంచెం పాలు పంచుకుందాం
ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధముందో
బంధువుల సంఖ్య పెంచుకుందాం
చేయందుకుందాం చిగురంత ధైర్యమై
భరోసానిద్దాం పద మనోబలమై
మనుషులం మనందరం
ఏకాకులం కాదే ఎవ్వరం
మంచితనం మన గుణం
పరస్పరం సాయం కాగలం
ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో
ఓ కొంచెం పాలు పంచుకుందాం
ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధముందో
బంధువుల సంఖ్య పెంచుకుందాం

ఏ రక్త బంధం లేకున్నా గాని స్పందించగలిగిన స్నేహితులం
ఈ చోటి ప్రేమ ఏ చోటికైనా అందించగలిగిన వారధులం
ఓ గుండె నిప్పును ఆర్పడం ఆపడం కదా ఉపకారం
వేరెవరి హాయికో జోలాలి పాడడం ఆహా ఎంత వరం
ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో
ఓ కొంచెం పాలు పంచుకుందాం

ఖాళీలెన్నెన్నో పుట్టించేస్తుంది
ఖాళీగా ఉండలేని కాలమిది
మనసైనదాన్ని మాయం చేస్తుంది
తప్పించుకోలేని జాలమిది
ఆ లోటు తీర్చగా ఇపుడూ ఎపుడూ మనం ముందుందాం
కష్టాల బరువును తేలికపరిచే భుజం మనమవుదాం
ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో
ఓ కొంచెం పాలు పంచుకుందాం
ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధముందో
బంధువుల సంఖ్య పెంచుకుందాం



Credits
Writer(s): Gopi Sundar, D Ramajogaiah Sastry
Lyrics powered by www.musixmatch.com

Link