Kannullo Ne Roopame (From "Ninne Pelladatha")

కన్నుల్లో నీ రూపమే
గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే
నా శ్వాస నీ కోసమే
ఆ ఊసునీ తెలుపేందుకు
నా భాష ఈ మౌనమే
కన్నుల్లో నీ రూపమే
గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే
నా శ్వాస నీ కోసమే

మదిదాచుకున్న రహస్యాన్ని వెతికేటి
నీ చూపునాపేదెలా
నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న
నా మనసు తేలేదెలా
గిలిగింత పెడుతున్న నీ చిలిపి
తలపులతో ఏమో ఎలా వేగడం
కన్నుల్లో నీ రూపమే
గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే
నా శ్వాస నీ కోసమే

అదిరేటి పెదవుల్ని బతిమాలుకున్నాను
మదిలోని మాటేదనీ
తలవంచుకుని నేను తెగ ఎదురుచుశాను
నీ తెగువ చూడాలనీ
చూస్తూనే వేళంతా తెలవారి పోతుందో
ఏమో ఎలా ఆపడం

కన్నుల్లో నీ రూపమే
గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే
నా శ్వాస నీ కోసమే
ఆ ఊసునీ తెలుపేందుకు
నా భాష ఈ మౌనం
కన్నుల్లో నీ రూపమే
గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే
నా శ్వాస నీ కోసమే



Credits
Writer(s): Sitaram Sastry, Sandeep Chawtha
Lyrics powered by www.musixmatch.com

Link