Enka Yedo Kavai Antu (From "Ninne Pelladatha")

హబ్బబ్బ దూకుతోంది లేత ఈడు నీ చూపు లాగి
ఒళ్ళంతా తాకుతుంది వింత కైపు నీ ఊహ కాగి
ఇంకా ఏదో కావాలంటూ
వేడెక్కి వేగుతోంది కోడె ఈడు నీ శ్వాస తాకి
కవ్వింత రేగుతోంది కోరుకున్న నీ స్పర్శ సోకి
ఇంకా ఏదో కావాలంటూ

ఒంపు ఒంపులోన ఉరికింది తాపం
చంపుతోంది నన్ను నాజూకు రూపం
ఏం చేసినా చాలు అనలేని ఈ వేళలో
ఇంకా ఏదో ఐపోమంటూ
ఉప్పొంగి దూకుతోంది లేత ఈడు నీ చూపు లాగి
ఒళ్ళంతా తాకుతుంది వింత కైపు నీ ఊహ కాగి

గోటి గాటు తీపి గాయాలు రేపి
పంటి గాటు తోటి ప్రాయాన్ని లేపి
నరనరములే నిప్పు రాజేసిన మత్తులో
ఇంకా ఏదో చేసేయ్ మంటూ
వేడెక్కి వేగుతోంది కోడె ఈడు నీ శ్వాస తాకి
కవ్వింత రేగుతోంది కోరుకున్న నీ స్పర్శ సోకి
ఇంకా ఏదో కావాలంటూ
ఇంకా ఏదో కావాలంటూ
ఇంకా ఏదో కావాలంటూ



Credits
Writer(s): Sitaram Sastry, Sandeep Chawtha
Lyrics powered by www.musixmatch.com

Link