Sirimalle Neeve

సిరిమల్లె నీవే విరిజల్లు కావే
వరదల్లె రావే వలపంటె నీవే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే
సిరిమల్లె నీవే విరిజల్లు కావే

ఎలదేటి పాటా చెలరేగె నాలో చెలరేగిపోవే మధుమాసమల్లే
ఎలమావి తోటా పలికింది నాలో పలికించుకోవే మది కోయిలల్లే
నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే
తొలిపూత నవ్వే వనదేవతల్లే
పున్నాగపూలే సన్నాయి పాడే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే
సిరిమల్లె నీవే విరిజల్లు కావే

ఆ ఆ ఆ అ అ ఆ

మరుమల్లె తోటా మారాకు వేసే మారాకు వేసే నీ రాకతోనే
నీ పలుకు పాటై బ్రతుకైన వేళా బ్రతికించుకోవే నీ పదముగానే
నా పదము నీవే నా బ్రతుకు నీవే అనురాగమల్లే సుమగీతమల్లే
నన్నల్లుకోవే నా ఇల్లు నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే
సిరిమల్లె నీవే విరిజల్లు కావే
ఆహా ఆహా ఆహ లలల



Credits
Writer(s): Veturi Sumdara Ramamurthy, Rajan Nagendra
Lyrics powered by www.musixmatch.com

Link