Shivaranjani

శివరంజని నవరాగిణి వినినంతనే నా తనువులోని అణువణువు కరిగించే అమృతవాహిని
ఆ ఆ ఆ శివరంజని నవరాగిణి ఆ ఆ ఆ ఆ

రాగాల సిగలోన సిరిమల్లివి
సంగీత గగనాన జాబిల్లివి
రాగాల సిగలోన సిరిమల్లివి సంగీత గగనాన జాబిల్లివి
స్వర సుర ఝురీ తరంగానివి
సరస హృదయ వీణా వాణివి
శివరంజని నవరాగిణి ఆ ఆ ఆ ఆ

ఆ కనులు పండు వెన్నెల గనులు
ఆ కురులు ఇంద్రనీలాల వనులు
ఆ కనులు పండు వెన్నెల గనులు ఆ కురులు ఇంద్రనీలాల వనులు
ఆ వదనం అరుణోదయ కమలం
ఆ అధరం సుమధుర మధుకలశం
శివరంజని నవరాగిణి ఆ ఆ ఆ ఆ

జనకుని కొలువున అల్లనసాగే జగన్మోహిని జానకి
వేణుధరుని రధమారోహించిన విధుషీమణి రుక్మిణి
రాశీకృత నవరసమయ జీవన రాగచంద్రికా
లలిత లావణ్య భయద సౌందర్య కలిత చండికా

రావే ఏ రావే నా శివరంజనీ మనోరంజనీ రంజనీ నా రంజనీ
నీవే నీవే నాలో పలికే నా దానివీ
నీవే నా దానివీ నా దానివి నీవే నాదానివీ



Credits
Writer(s): Naidu P Ramesh, Dr. C Narayana Reddy
Lyrics powered by www.musixmatch.com

Link