Anuraaga Devathaneeve

అనురాగ దేవత నీవే
నా ఆమని పులకింత నీవే
నా నీడగా ఉండి నీవే నీ తోడుగా ఉండనీవే ఉండిపోవే
అనురాగ దేవత నీవే నా ఆమని పులకింత నీవే
నా నీడగా ఉండి నీవే నీ తోడుగా ఉండనీవే ఉండిపోవే

ఏనాటిదో ఈ అనుబంధం ఎద చాలని మధురానందం
ఏనాటిదో ఈ అనుబంధం ఎద చాలని మధురానందం
నేనేడు జన్మలు ఎత్తితే ఏడేడు జన్మలకు ఎదిగే బంధం
ఇది వీడరాని బంధం మమతానురాగ బంధం
అనురాగ దేవత నీవే

నను నన్నుగా ప్రేమించవే నీ పాపగా లాలించవే
నను నన్నుగా ప్రేమించవే నీ పాపగా లాలించవే
నా దేవివై దీవించవే నా కోసమే జీవించు
నీ దివ్యసుందర రూపమే నా గుండె గుడిలో వెలిగే దీపం
నా జీవితం నీ గీతం మన సంగమం సంగీతం

అనురాగ దేవత నీవే నా ఆమని పులకింత నీవే
నా నీడగా ఉండి నీవే నీ తోడుగా ఉండనీవే ఉండిపోవే
అనురాగ దేవత నీవే



Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, K V Mahadevan
Lyrics powered by www.musixmatch.com

Link