Nannu Vadali

నన్ను వదలి నీవు పోలేవులే, అది నిజములే
పువ్వులేక తావి నిలువలేదులే, లేదులే

నన్ను వదలి నీవు పోలేవులే, అది నిజములే
పువ్వులేక తావి నిలువలేదులే, లేదులే

తావిలేని పువ్వు విలువ లేనిదే, ఇది నిజములే
నేను లేని నీవు లేనెలేవులే, లేవులే

తావిలేని పువ్వు విలువ లేనిదే, ఇది నిజములే
నేను లేని నీవు లేనెలేవులే, లేవులే

నా మనసే చిక్కుకొనె నీ చూపుల వలలో
నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో
నా మనసే చిక్కుకొనె నీ చూపుల వలలో
నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో
చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయె
చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయె
దూరదూర తీరాలు చేరువైపోయె

తావిలేని పువ్వు విలువ లేనిదే, ఇది నిజములే
నేను లేని నీవు లేనెలేవులే, లేవులే

సిగ్గుతెరలలో కనులు దించుకొని తలను వంచుకొని
బుగ్గమీద పెళ్ళిబొట్టు ముద్దులాడ
సిగ్గుతెరలలో కనులు దించుకొని తలను వంచుకొని
బుగ్గమీద పెళ్ళిబొట్టు ముద్దులాడ
రంగులీను నీ మెడలో బంగారపు తాళిగట్టి
పొంగిపోవు శుభదినం రానున్నదిలే
ఓ...
నన్ను వదలి నీవు పోలేవులే, అది నిజములే
పువ్వులేక తావి నిలువలేదులే, లేదులే

తొలినాటి రేయి తడబాటు పడుతూ
మెలమెల్లగా నీవు రాగా
నీ మేని హొయలు నీలోని వగలు నాలోన గిలిగింతలిడగా

హృదయాలు కలసి ఉయ్యాలలూగి ఆకాశమే అందుకొనగా
పైపైకి సాగే మేఘాల దాటి కనరాని లోకాలు కనగా

ఆహా ఓహో ఊహూ
ఆ ఆ ఆ ఆ

నిన్ను వదలి నేను పోలేనులే, అది నిజములే
నీవు లేని నేను లేనెలేనులే, లేనులే
నిన్ను వదలి నేను పోలేనులే, అది నిజములే
నీవు లేని నేను లేనెలేనులే, లేనులే



Credits
Writer(s): Dasarathi, K V Mahadevan
Lyrics powered by www.musixmatch.com

Link