Chethilo Cheyyesi

చేతిలో చెయ్యేసి చెప్పు బావా
చేసుకున్న బాసలు చెరిగి పోవని మరచి పోనని
చేతిలో చెయ్యేసి చెప్పు బావా
చేసుకున్న బాసలు చెరిగి పోవని మరచి పోనని
చేతిలో చెయ్యేసి చెప్పు రాధా
చెప్పుకున్న వూసులు మాసి పోవనీ మారిపోవని
చేతిలో చెయ్యేసి చెప్పు రాధా
చెప్పుకున్న వూసులు మాసి పోవనీ మారిపోనని
చేతిలో చెయ్యేసి చెప్పు బావా

పాడుకున్న పాటలు పాతబడి పోవనీ చిలిపిగ ఆడుకున్న ఆటలకు అలుపు రానివ్వనని
పాడుకున్న పాటలు పాతబడి పోవనీ చిలిపిగ ఆడుకున్న ఆటలకు అలుపు రానివ్వనని
పడుచు గుండె బిగువులు సడలి పోనివ్వనని
పడుచు గుండె బిగువులు సడలి పోనివ్వనని
దుడుకుగ వురికిన పరువానికి ఉడుకు తగ్గిపోదని
చేతిలో చెయ్యేసి చెప్పు బావా
చెప్పుకున్న వూసులు మాసి పోవనీ మారిపోనని
చేతిలో చెయ్యేసి చెప్పు రాధా

కన్నెగా కన్నకలలు కధలుగా చెప్పాలి
మనకధ కలకాలం చెప్పినా కంచికెళ్ళకుండాలి
కన్నెగా కన్నకలలు కధలుగా చెప్పాలి
మనకధ కలకాలం చెప్పినా కంచికెళ్ళకుండాలి
మనజంట జంటలకే కన్నుకుట్టుకావాలి
మనజంట జంటలకే కన్నుకుట్టుకావాలి
ఇంక ఒంటరిగా వున్న వాళ్ళు జంటలైపొవాలి
చేతిలో చెయ్యేసి చెప్పు బావా
చేసుకున్న బాసలు చెరిగి పోవని మరచి పోనని
చేతిలో చెయ్యేసి చెప్పు రాధా
చెప్పుకున్న వూసులు మాసి పోవనీ మారిపోనని
చేతిలో చెయ్యేసి చెప్పు బావా

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ: దసరా బుల్లోడు: కె.వి. మహదేవన్:ఘంటసాల, పి. సుశీల



Credits
Writer(s): Athreya, K V Mahadevan
Lyrics powered by www.musixmatch.com

Link