Intinti Ramayanam

ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము
సీతమ్మ చిలకమ్మ, రామయ్య గోరింక
వలపుల తలపుల సరాగం
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం అహహ
నీవుంటే నందన వనము
లేకుంటే అశోక వనము
నీవుంటే నందన వనము
లేకుంటే అశోక వనము
నీవాడే ఊసులన్ని రతనాల రాశులే
నీవుంటే పూల బాట
లేకుంటే రాళ్ల బాట
నీవుంటే పూల బాట
లేకుంటే రాళ్ల బాట
నీ తోటి ఆశలన్ని
సరసాల పాటలు ముత్యాల మూటలు
అల్లల్లే ఎహే

ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము

చిలకమ్మ, గోరింక
అ సిరిమల్లే అ పొదరింట
చిలకమ్మ, గోరింక సిరిమల్లె పొదరింట
నవ్వాలి నవ్వాలి
కలిసి కిలకిల నవ్వాలి
కలిసి కిలకిల నవ్వాలి
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం హో

సరిగంచు చీరలు తెస్తా
కవరింగు సరుకులు పెడతా
సరిగంచు చీరలు తెస్తా
కవరింగు సరుకులు పెడతా
తెమ్మంటే మాయలేడి తేలేనే నిన్నొదిలి
ఓ ఓ ఓ ఓ ఒహొహొహొహొ హొయ్
మబ్బుల్లో నీళ్లు చూసి
ముంత ఒలకబోసుకోను
మబ్బుల్లో నీళ్లు చూసి
ముంత ఒలకబోసుకోను
కీచులాడుకున్నా నువ్వు రోషమొచ్చి పోకురా
కలిసి మెలిసి ఉండరా హోయ్
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం ఓ
ఇల్లే కద స్వర్గ సీమ
ఇద్దరిది చెరగని ప్రేమ
ఇల్లే కద స్వర్గ సీమ
ఇద్దరిది చెరగని ప్రేమ
కలతలేని కాపురాన కలలన్ని పండాలి
అహహహహ మోజున్న ఆలు మగలు
కులకాలి రేయి పగలు
మోజున్న ఆలు మగలు
కులకాలి రేయి పగలు
మన ఇద్దరి పొందిక చూసి
ఈ లోకం మెచ్చాలి
దీవెనలే ఇవ్వాలి

ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము
సీతమ్మ చిలకమ్మ రామయ్య గోరింక
వలపుల తలపుల సరాగం
అరరె ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము
అహహ చిలకమ్మ గోరింక సిరిమల్లె పొదరింట
నవ్వాలి నవ్వాలి
కలిసి కిలకిల నవ్వాలి
కలిసి కిలకిల నవ్వాలి
ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం
కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము
కలిసుంటే సల్లాపము విడిపోతే కల్లోలము



Credits
Writer(s): Arudra, Rajan Nagendra
Lyrics powered by www.musixmatch.com

Link