Seethalu Singaram

సీతాలు సింగారం. మాలచ్చి బంగారం.
సీతామాలచ్చిమంటే శ్రీలచ్చిమవతారం.

సీతాలు సింగారం. మాలచ్చి బంగారం
సీతామాలచ్చిమంటే. శ్రీలచ్చిమవతారం

మనసున్న మందారం. మనిషంతా బంగారం.
బంగారు కొండయ్యంటే. భగవంతుడవతారం

మనసున్న మందారం. మనిషంతా బంగారం.
బంగారు కొండయ్యంటే. భగవంతుడవతారం.

సీతాలు సింగారం.ఊమ్మ్...

కూసంత నవ్విందంటే పున్నమి కావాల...
ఐతే నవ్వనులే.ఏ.ఏ

కాసంత చూసిందంటే కడలే పొంగాల...
ఇక చూడనులే .ఏ. ఏ

కూసంత నవ్విందంటే పున్నమి కావాల.
కాసంత చూసిందంటే కడలే పొంగాల.

ఎండితెర మీద పుత్తడి బొమ్మ ఎలగాల ఎదగాల
ఆ ఎదుగు బొదుగు ఎలుగు కన్నుల ఎన్నెల కాయాల.
నువ్వంటుంటే. నేవింటుంటే. నూరేళ్ళు నిండాల... ఆ.

సీతాలు సింగారం. మాలచ్చి బంగారం
బంగారు కొండయ్యంటే .భగవంతుడవతారం
మనసున్న మందారం... ఊమ్మ్... ఊమ్మ్...

లలల్లలా.లాలాలాలా.లలలాలా.

దాగుడు మూతలు ఆడావంటే దగ్గరకే రాను.
ఐతే నేనే వస్తాలే. ఏ. ఏ

చక్కలిగింతలు పెట్టావంటే చుక్కై పోతాను.
ఎగిరొస్తాలే. ఏ. ఏ.

దాగుడు మూతలు ఆడావంటే దగ్గరకే రాను
చక్కలిగింతలు పెట్టావంటే చుక్కై పోతాను

గుండె గుడిలోన దివ్వెవు నువ్వై వెలిగి... వెలిగించాల
నీ వెలుగుకు నీడై. బ్రతుకున తోడై. ఉండిపోవాలా
నువ్వంటుంటే. నేవింటుంటే. వెయ్యేళ్ళు బతకాలా . ఆ.

సీతాలు సింగారం. మాలచ్చి బంగారం
బంగారు కొండయ్యంటే. భగవంతుడవతారం.
లలలాల.లలలా.లలలా...



Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, K V Mahadevan
Lyrics powered by www.musixmatch.com

Link