Mavi Chiguru

మావి చిగురు తినగానే ఏఏఏ కోయిల పలికేనా
మావి చిగురు తినగానే ఏఏఏఏ కోయిల పలికేనా
కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా
కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా
ఏమో ఏమనునోగాని ఆమని ఈవని
మావి చిగురు తినగానేఏఏఏఏకోయిల పలికేనా ఆ
కోయిల పలికేనా
తెమ్మెరతో తారాటలా తుమ్మెదతో సయ్యాటలా
తెమ్మెరతో తారాటలా తుమ్మెదతో సయ్యాటలా
తారాటలా సయ్యాటలా సయ్యాటలా తారాటలా
వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు
వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు
బింకాలు బిడియాలు
పొంకాలు పోడుములు
ఏమో ఎవ్వరిదో గాని ఈ విరి గడసరి
మావి చిగురు తినగానేఏఏఏఏకోయిల పలికేనా ఆ
కోయిల పలికేనా
ఒకరి ఒళ్ళు ఉయ్యాలా వేరొకరి గుండె జంపాల
ఉయ్యాలా జంపాల జంపాల ఉయ్యాలా
ఒకరి ఒళ్ళు ఉయ్యాలా వేరొకరి గుండె జంపాల
ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో
ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో
పలకరింతలో పులకరింతలో
పలకరింతలో పులకరింతలో
ఏమో ఏమగునో గాని ఈ కత మన కత
మావి చిగురు తినగానే ఏఏఏఏ కోయిల పలికేనా
కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా
ఏమోఏమనునోగాని ఆమని ఈవని
మావి చిగురు తినగానే ఏఏఏఏ కోయిల పలికేనా ఆ
కోయిల పలికేనా



Credits
Writer(s): K V Mahadevan, Devulapalli Krishna Sastry
Lyrics powered by www.musixmatch.com

Link