Navvave Navamaalika

ఆకాశాన సూర్యుడుండడు సందెవేళకే
చందమామకి రూపముండదు తెల్లవారితే
ఈ మజిలీ మూడు నాళ్ళే ఈ జీవయాత్రలో

ఒక పూటలొనె రాలు పూవులెన్నో

నవ్వవే నవమల్లికా
ఆశలే అందాలుగా
ఎదలోతుల్లో ఒక ముళ్లున్నా, వికసించాలె ఇక రోజాలా
కన్నీటి మీద నావసాగనేల

నవ్వవే నవమల్లికా
ఆశలే అందాలుగా

కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసంలో
తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు రోజే చాలులే
చింత పడే చిలిపి చిలకా
చిత్రములే బ్రతుకు నడకా
పుట్టే ప్రతి మనిషి కను మూసే తీరు
మళ్ళీ తన మనిషై ఒడిలోకే చేరు
మమతానురాగ స్వాగతాలు పాడ

నవ్వవే నవమల్లికా
ఆశలే అందాలుగా

ముళ్లును పూవ్వుగా బాధను నవ్వుగా మర్చుకున్న ఈ రోజాకీ
జన్మ బంధమో ప్రేమ గంధమో పూట చాలులే
పంజరమై బ్రతుకు మిగులు
పావురమే బైటికెగురు
మైనా క్షణమైనా పలికిందే భాష
ఉన్నా కలగన్నా విడిపోదీ ఆశ
విధి రాతకన్నా లేదు వింత పాట

నవ్వవే నవమల్లికా
ఆశలే అందాలుగా
ఎదలోతుల్లో ఒక ముళ్లున్నా, వికసించాలె ఇక రోజాలా
కన్నీటి మీద నావసాగనేల

నవ్వవే నవమల్లికా
ఆశలే అందాలుగా



Credits
Writer(s): Veturi Sundararama Murthy, M.m. Keeravaani
Lyrics powered by www.musixmatch.com

Link