Chukkallara

చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలి
మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండి దారికి
వెళ్ళనివ్వరా వెన్నెలింటికి?
విన్నవించరా వెండి మింటికి!
జోజో... లాలి, జోజో... లాలి

మలిసంధ్య వేళాయే. చలిగాలి వేణువాయే. నిదురమ్మా ఎటు పోతివే?
మునిమాపు వేళాయే. కనుపాప నిన్ను కోరే. కునుకమ్మా ఇటు చేరవే?
నిదురమ్మా ఎటు పోతివే?, కునుకమ్మా ఇటు చేరవే?
నిదురమ్మా ఎటు పోతివే?, కునుకమ్మా ఇటు చేరవే?
గోధూళి వేళాయే, గూళ్ళన్నీ కనులాయే
గోధూళి వేళాయే, గూళ్ళన్నీ కనులాయే
గువ్వల రెక్కలపైన రివ్వు రివ్వున రావే
జోల పాడవా బేల కళ్ళకి
వెళ్ళనివ్వరా వెన్నెలింటికి?
జోజో... లాలి, జోజో... లాలి
జోజో... లాలి, జోజో... లాలి



Credits
Writer(s): Raj-koti, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link