Sirimallemma

సిరిమల్లెమ్మా హా ఓ హా
చిరునవ్వమ్మా హా ఓ
మా పల్లెకు పేరంటము
వస్తారా తెస్తారా
మీ రాకతో ఏరువాక
సిరిమల్లెమ్మా చిరునవ్వమ్మా

మా ఇంటి పొదరింటి పూలు
కోవెల్లో రామయ్య కోసం
మా ఊరి మాగాణి చేలు
పండేను పది మందికోసం
కల్లంటే తెలియంది మా పల్లెమ్మా
గోవంటే మాలక్ష్మి మా గోపెమ్మా
కొమ్మల్లో కూసే ఓ ఓ కోయిలమ్మా
మావిళ్లు పూసేటి మధుమాస రాగాలు
మా నోట పండించవమ్మా
సిరిమల్లెమ్మా హా చిరునవ్వమ్మా హొ

బంతుల్లో చేమంతులల్లే
కలిసేటి మనసుంది మాకు
మబ్బుల్లో తారల్లే మెరిసే
గుణమొక్కటే మాకు సోకు
వరితోనే సిరులిచ్చే గోదావరి
దిగి వచ్చే స్వర్గాలే మా ఊరికి
ఏ జన్మకైనా ఈ నేలపైనా
పువ్వల్లే పుట్టాలి
దివ్వల్లే వెలగాలి
ఆ పుణ్యమే చాలునమ్మా

సిరిమల్లెమ్మా హా ఓ
చిరునవ్వమ్మా హా ఓ
మా పల్లెకు పేరంటము
వస్తారా తెస్తారా
మీ రాకతో ఏరువాక
సిరిమల్లెమ్మా చిరునవ్వమ్మా



Credits
Writer(s): Veturi Sundararama Murthy, Chakravarthy
Lyrics powered by www.musixmatch.com

Link