Jummandi Nadam

ఝుమ్మంది నాదం, సయ్యంది పాదం
తనువూగింది ఈవేళ, చెలరేగింది ఒక రాసలీల
ఝుమ్మంది నాదం, సయ్యంది పాదం
తనువూగింది ఈవేళ, చెలరేగింది ఒక రాసలీల

ఎదలోని సొదలా, ఎలదేటి రొదలా
కదిలేటి నదిలా, కలల వరదలా
ఎదలోని సొదలా, ఎలదేటి రొదలా
కదిలేటి నదిలా, కలల వరదలా
చలిత లలిత పద కలిత కవితలెద సరిగమ పలికించగా
స్వర మధురిమలొలికించగా
సిరి సిరి మువ్వలు పులకించగా
ఝుమ్మంది నాదం, సయ్యంది పాదం
తనువూగింది ఈవేళ, చెలరేగింది ఒక రాసలీల

నటరాజ ప్రేయసి, నటనాల ఊర్వశి
నటియించు నీవని తెలిసి
నటరాజ ప్రేయసి, నటనాల ఊర్వశి
నటియించు నీవని తెలిసి
ఆకాశమై పొంగె ఆవేశం
కైలాసమే వంగె నీకోసం
ఝుమ్మంది నాదం, సయ్యంది పాదం

మెరుపుంది నాలో, అది నీ మేని విరుపు
ఉరుముంది నాలో, అది నీ మువ్వ పిలుపు
చినుకు చినుకులో చిందు లయలతో
కురిసింది తొలకరి జల్లు
విరిసింది అందాల హరివిల్లు
ఈ పొంగులే ఏడు రంగులుగా
ఝుమ్మంది నాదం, సయ్యంది పాదం
తనువూగింది ఈవేళ, చెలరేగింది ఒక రాసలీల



Credits
Writer(s): Veturi, Mahadevan, K.v. Sunsararamamurthi
Lyrics powered by www.musixmatch.com

Link