Dialogue & Music (Siri Siri Muvva): Ekad Ketare / Radigira Divininchi

కలడందురు దీనుల ఎడ
కలడందురు పరమయోగి గణముల పాలన్
కలడందురన్ని దిశలను కలడు
కలండనెడువాడు కలడో లేడో

రా... దిగిరా.దివి నించి భువికి దిగిరా
రా... దిగిరా.దివి నించి భువికి దిగిరా
రా... దిగిరా.దివి నించి భువికి దిగిరా
రా... దిగిరా.దివి నించి భువికి దిగిరా

రామ హరే శ్రీరామహరే
రామ హరే శ్రీరామహరే

రాతిబొమ్మకు రవ్వలు పొదిగి
రామహరే శ్రీరామహరే
రాతిబొమ్మకు రవ్వలు పొదిగి
రామహరే శ్రీరామహరే
అని పట్టిన హారతి చూస్తూ ఏమీ
పట్టనట్టు కూర్చుంటే చాలదు

రా... దిగిరా.దివి నించి భువికి దిగిరా
రా... దిగిరా.దివి నించి భువికి దిగిరా
రామ హరే శ్రీరామహరే
రామ హరే శ్రీరామహరే

అలనాటి ఆ సీత ఈనాటి దేవత
శతకోటి సీతల కలబోత ఈ దేవత
రామచంద్రుడా కదలిరా
రామబాణమే వదలరా
ఈ ఘోరకలిని మాపరా
ఈ క్రూరబలిని ఆపరా

రా... రా.దివి నించి భువికి దిగిరా
రా... రా.దివి నించి భువికి దిగిరా
రామ హరే శ్రీరామహరే
రామ హరే శ్రీరామహరే

నటరాజ శత సహస్ర రవితేజ
నటగాయక వైతాళిక మునిజనభోజ
నటరాజ శత సహస్ర రవితేజ
నటగాయక వైతాళిక మునిజనభోజ
దీనావన భవ్యకళా దివ్య పదాంభోజ
చెరిసగమై రసజగమై
చెలగిన నీచెలి ప్రాణము
బలివశువై యజ్ఞవాటి
వెలిబూడిద అయిన క్షణము
సతీవియోగము సహియించక
దుర్మతియౌదక్షుని మదమడంచగ
ఢమ ఢమ ఢమ ఢమ ఢమరుక ధ్వనుల
నమక చమక యమ గమక లయంకర
సకలలోక జగ్జరిత భయంకర
వికట నటస్ఫట విస్ఫులింగముల
విలయతాండవము సలిపిన నీవే
శిలవే అయితే పగిలిపో
శివుడే అయితే రగిలిపో

(దిలీప్ చక్రవర్తి)



Credits
Writer(s): Mahadevan K V, Veturi Sundararama Murthy
Lyrics powered by www.musixmatch.com

Link