Ra Ra Swami Ra Ra / Dialogue (Siri Siri Muvva): Nang Deval

రారా స్వామి రారా
యదువంశ సుధాంబుధి చంద్ర స్వామి రారా
శతకోటి మన్మధాకారా
స్వరరాగ సుధారస వీరా స్వామి రారా
నా పాలి దిక్కు నీవేరా
నీ పదములంటి మ్రొక్కేరా
నీ దానరా రావేలరా నన్నేలరా
భరత శాస్త్ర సంభరిత పదద్వయ
చరిత నిరత సమధుర మంగళ గళ రారా స్వామీ రారా

రాగాలెన్నో పండిన గారాల నీ మెడలో
అనురాగ మూలకలే వేయాలని
నీ చల్లని చరణాలు చల్లిన కిరణాలలో
రేపటి కోసం చీకటి రెప్పల తెర తీయాలని
పిలిచాను ఎదుట నిలిచాను
కోరి కోరి నిన్నే వలచాను
పిలిచాను ఎదుట నిలిచాను
కోరి కోరి నిన్నే వలచాను

గంగ కదిలి వస్తే కడలి ఎలా పొంగిందో
యమున సాగివస్తే ఆ గంగ ఏమి పాడిందో
ఆమని వచ్చిన వేళ అవని ఎంత మురిసిందో
మోహన వేణువు తాకిన మోవి ఎలా మెరిసిందో

ఊగింది తనువు అలాగే పొంగింది మనసు నీలాగే
ఊగింది తనువు అలాగే పొంగింది మనసు నీలాగే

శ్రుతి కలిపిందెన్నడో సిరిమువ్వల సవ్వడిలో
జత కలిసిందిప్పుడే ఆ గుడిలోన నీ ఒడిలో
శ్రుతి కలిపిందెన్నడో సిరిమువ్వల సవ్వడిలో
జత కలిసిందిప్పుడే ఆ గుడిలోన నీ ఒడిలో
మువ్వనై పుట్టాలని అనుకున్నా నొకనాడు
మువ్వనై పుట్టాలని అనుకున్నా నొకనాడు
దివ్వెనై నీ వెలుగులు రువ్వనీ యీ నాడు
పిలిచాను ఎదుట నిలిచాను
కోరి కోరి నిన్నే వలచాను

(దిలీప్ చక్రవర్తి)



Credits
Writer(s): Mahadevan K V, Veturi Sundararama Murthy
Lyrics powered by www.musixmatch.com

Link