Ide Paata

ఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటాను
పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను
ఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటాను
పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను
ఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటాను

నా పాట విని మురిశావు ఆ పైన నను వలచావు
నా పాట విని మురిశావు ఆ పైన నను వలచావు
కలలాగ నను కలిశావు లతలాగ నను పెనవేశావు
ఒక గానమై ఒక ప్రాణమై జతగూడి మనమున్నాము
ఉన్నాము ఉన్నాము

ఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటాను
పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను
ఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటాను

నాడేమి ఉందని భ్రమశేవు నేడేమి లేదని విడిచేవు
నాడేమి ఉందని భ్రమశేవు నేడేమి లేదని విడిచేవు
ఆ మూడూ ముళ్ళని మరిచేవు నా పాల మనసుని విరిచేవు
ఈనాడు నన్ను విడనాడినా
ఏనాటికైనా కలిసేవు నువు కలిసేవు నువు నను కలిసేవు

ఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటాను
పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను
ఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటానూ

రచన: సి.నారాయణ రెడ్డి: ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం



Credits
Writer(s): Dr. C Narayana Reddy, Satyam
Lyrics powered by www.musixmatch.com

Link