Abhinava Tharavo

అభినవ తారవో . నా అభిమాన తారవో.ఓఓఓ
అభినవ తారవో.
అభినయన రసమయ కాంతిధారవో
అభినయ రసమయ కాంతిధారవో
మంజుల మధుకర సింజాల సుమశర
శింజిని శివరంజనీ .నీ. శివరంజనీ

అది దరహాసమా . మరి మధుమాసమా
అది దరహాసమా . మరి మధుమాసమా
ఆ మరునికి దొరికిన కవకాశమా
అవి చరణమ్ములా? శశికిరణమ్ములా?
అవి చరణమ్ములా? శశికిరణమ్ములా?
నా తరుణ భావనా హరినమ్ములా
అభినవ తారవో . నా అభిమాన తారవో.ఓఓఓ
అభినవ తారవో. శివరంజనీ .నీ. శివరంజనీ

ఆ నయనాలు విరిసిన చాలు.
అమావస నిశిలో చంద్రోదయాలు
ఆ నయనాలు విరిసిన చాలు.
అమావస నిశిలో చంద్రోదయాలు

అమెన్నడుము ఆడిన చాలు ...
అమెన్నడుము ఆడిన చాలు.
రవళించును పదకవితా ప్రభందాలు
అభినవ తారవో . నా అభిమాన తారవో.ఓఓఓ
అభినవ తారవో. శివరంజనీ ...నీ... శివరంజనీ

దుర్గా లక్ష్మీనారాయణ

నీ శృంగార లలిత భంగిమలో. పొంగిపోదురే ఋషులైనా
నీ కరుణరసావిష్కరణంలో కరిగిపోదురే కర్కశులైనా
వీరమా ... నీ కుపిత నేత్ర సంచారమే.
హాస్యమా ... నీకది చిటికలోన వశ్యమే
నవరస పోషణ చణవనీ
నటనాంకిత జీవనివనీ
నిన్ను కొలిచి వున్నవాడ.
మిన్నులందుకున్నవాడ...
ఆ... ఆ... ఆ... ఆ...
నీ ఆరాధకుడను.
ఆస్వాదకుడను.
అనురక్తడనూ.
నీ ప్రియభక్తుడనూ.

అభినవ తారవో . నా అభిమాన తారవో.ఓఓఓ
అభినవ తారవో. శివరంజనీ .నీ. శివరంజనీ.నీ

చిత్రం: శివరంజని (1978)
సంగీతం: రమేశ్ నాయుడు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు



Credits
Writer(s): Naidu P Ramesh, Dr. C Narayana Reddy
Lyrics powered by www.musixmatch.com

Link