Vidhatha Talapuna

విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓం...
ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం ఓం...
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసమ్
ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం... ఆఆఆఆఆఆ...

సరసస్వర సురఝారీగమనమౌ సామవేద సారమిది
సరసస్వర సురఝారీగమనమౌ సామవేద సారమిది
నేపాడిన జీవన గీతం ఈ గీతం
విరించినై విరచించితిని ఈ కవనమ్
విపంచినై వినిపించితిని ఈ గీతమ్

ప్రార్దిష వీణియ పైన దినకర మయూహ తంత్రులపైన

జాగృత విహంగ తతులె వినీల గగనపు వేదిక పైన
ప్రార్దిష వీణియ పైన దినకర మయూహ తంత్రులపైన
జాగృత విహంగ తతులె వినీల గగనపు వేదిక పైన
పలికిన కిలకిల త్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగా
విశ్వకావ్యమునకిది భాష్యముగా

విరించినై విరచించితిని ఈ కవనమ్
విపంచినై వినిపించితిని ఈ గీతమ్

జనించు ప్రతిశిశు గళమున పలికిన జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయమృదంగధ్వానం
జనించు ప్రతిశిశు గళమున పలికిన జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయమృదంగధ్వానం
అనాదిరాగం ఆది తాళమున అనంత జీవన వాహిని గా
సాగిన సృష్టి విలాసము నే
విరించినై విరచించితిని ఈ కవనమ్
విపంచినై వినిపించితిని ఈ గీతమ్
నా ఉచ్వాసం కవనం నా నిశ్వాసం గానం
నా ఉచ్వాసం కవనం నా నిశ్వాసం గానం
సరసస్వరసురఝారీగమనమౌ సామవేద సారమిది
నేపాడిన జీవన గీతం ఈ గీతం



Credits
Writer(s): Sirivennela Sitaramasastry, K V Mahadevan
Lyrics powered by www.musixmatch.com

Link