Navaminaati Vennelaneevu

నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతి రేయి ఈఈ కార్తీక పున్నమి రేయి
నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతి రేయి ఈఈ కార్తీక పున్నమి రేయి
నవమి నాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలీ నీవు

నీ వయసే వసంత ఋతువై.
నీ మనసే జీవన మధువై.
నీ వయసే వసంత ఋతువై.
నీ మనసే జీవన మధువై.
నీ పెదవే నా పల్లవిగా
నీ నగవే సిగ మల్లికగా
చెరిసగమై యే సగమేదో మరచిన మన తొలి కలయికలో ఓఓఓఓ
నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతి రేయి ఈఈ కార్తీక పున్నమి రేయి
నవమి నాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలీ నీవు

నీ ఒడిలో వలపును నేనై.
నీ గుడిలో వెలుగే నేనై.
నీ ఒడిలో వలపును నేనై.
నీ గుడిలో వెలుగే నేనై.
అందాలే నీ హారతిగా
అందించే నా పార్వతిగా
మనమొకటై రస జగమేలే సరసమధుర సంగమ గీతికలో ఓఓఓఓ
నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతి రేయి ఈఈ కార్తీక పున్నమి రేయి
నవమి నాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలీ నీవు

Credits
Writer(s): Naidu P Ramesh, Veturi Sundara Rama Murthy
Lyrics powered by www.musixmatch.com

Link