Chandamaama Vachchadamma

చందమామా వచ్చాడమ్మా తొంగితొంగి నిను చూశాడమ్మా
తలుపు తెరచుకో పిలుపు అందుకో
ముత్యాల ముంగిటలో కలువభామా ఆ ఆ
విడిదొసగి విందు చేయి కలువభామా
చందమామా వచ్చాడమ్మా తొంగితొంగి నిను చూశాడమ్మా ఆ నిను చూశాడమ్మా

ఎన్నెల మిఠాయి తెచ్చాడమ్మా ఆ ఆ తెచ్చాడమ్మా
సైయ్యాటకు పిలిచాడమ్మా ఆ ఆ పిలిచాడమ్మా
పన్నీరు చల్లవే పాన్పు వేయవే
ముత్యాల ముంగిటలో కలువభామా ఆ ఆ
విడిదొసగి విందు చేయి కలువభామా
చందమామా వచ్చాడమ్మా తొంగితొంగి నిను చూశాడమ్మా ఆ నిను చూశాడమ్మా

పడకగదికి వెళ్ళాలమ్మా ఆ ఆ వెళ్ళాలమ్మా
తాంబూలం ఇవ్వాలమ్మా ఆ ఆ ఇవ్వాలమ్మా
తంతు నడుపుకో చెంత చేరుకో ముత్యాల ముంగిటలో కలువభామా ఆ ఆ
విడిదొసగి విందు చేయి కలువభామా
చందమామా వచ్చాడమ్మా తొంగితొంగి నిను చూశాడమ్మా
తలుపు తెరచుకో పిలుపు అందుకో
ముత్యాల ముంగిటలో కలువభామా ఆ ఆ
విడిదొసగి విందు చేయి కలువభామా ఆ
చందమామా వచ్చాడమ్మా తొంగితొంగి నిను చూశాడమ్మా ఆ నిను చూశాడమ్మా

Credits
Writer(s): Naidu P Ramesh, Dasam Gopalakrishna
Lyrics powered by www.musixmatch.com

Link