Raa..Cheliya

రా... చెలియా
రావే... సఖియా
నువు లేక ఈ మనసు మసకేసిపోయినదే
నువు రాక ఈ వయసు ఇక ఆగిపోయినదే
రా... చెలియా
రావే... సఖియా
రా... చెలియా

నా ఊహలలో మెరిసే ఓ దేవతవే
నీవే జత లేకపోతే
వెన్నెలైనా ఇక పైన రాదే
మదిలో మెదిలే ఎన్నో కలలు
కలలా మిగిలే ఎన్నెన్నో ఆశలు
సఖియా త్వరగా రావే

నా వేణువులో నీవే చెలియా ఊపిరివే
నీవే ఒక ప్రేమ గీతం
రావే ఇంకా ఎంత కాలం
వీచే గాలి నీ పేరే చెప్పెనే
నింగి నేల నీ క్షేమం కోరెనే
మదిలో, ఎదలో నీవే
రా... చెలియా
రావే... సఖియా
నువు లేక ఈ మనసు మసకేసిపోయినదే
నువు రాక ఈ వయసు ఇక ఆగిపోయినదే
రా... చెలియా
రావే... సఖియా
రా... చెలియా... రా



Credits
Writer(s): G Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link